Войти
  • 1709Просмотров
  • 3 месяца назадОпубликованоvalluri saraswathi 2

"జన్మాష్టమి శుభాకాంక్షలు"రచన, సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.lyrics 👇

జన్మాష్టమి జన్మాష్టమి నాడు మోహనాకారుడు వీనుల విందైన మురళీగానముతో ఘల్లు ఘల్లు మను గజ్జల సవ్వడితో ముద్దుగారు బాలుడు ఏతెంచుచున్నాడు వనితలందరు యశోదమ్మలై ఆ ముచ్చట కనరే పల్లవి... చిన్ని చిన్ని అడుగులతో చిన్ని కృష్ణుడు అరుదెంచే వెతకి వెతకీ అలసినా యశోదమ్మ మనసు మురియగ ||చిన్ని|| 1. ఉట్టి మీదా పాలు, వెన్నలు దొంగిలించి తిన్న బాలుడు కొంటె చూపులు విసురుతూ ఏమి ఎరుగని వాని వలెనూ||చిన్ని|| 2. వెనుక వచ్చిన గొల్లె పడుచులు బాలకృష్ణుని కొంటె పనులను నంద పత్నికి విన్నవింప పరుగు పరుగున వచ్చుచుండా ||చిన్ని|| 3. వచ్చిన ఆ చిన్ని తనయుడు తల్లి ఒడిని చేరగానే గొల్లెతల చాడీలు మరచిన అమ్మ మనసు పరవశించే||చిన్ని|| రచన, సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి