Войти
  • 614Просмотров
  • 2 месяца назадОпубликованоభ్రామరీ సంకీర్తనా సాహిత్య గానం

శ్రీ మహాలక్ష్మి..ఘన కనకరాశులు కురిపించు శ్రీ మహాలక్ష్మి... భ్రామరీ సంకీర్తన

దేవి శరన్నవరాత్రులు అయిదవ రోజు: శ్రీ మహాలక్ష్మి రచన: శ్రీమతి కోమాండూరి విజయలక్ష్మి శ్రీనివాసన్ గానం : శ్రీమతి అర్చకం చిత్రలత ఘన కనకరాశులు కురిపించు శ్రీ మహాలక్ష్మి ఘనమైన ఇంద్రకీలాద్రి శిఖరిపై వెలిసిన శ్రీ లక్ష్మి క్షీర జలధిలో ప్రభవించిన అమృత మహలక్ష్మి పరమామృత ధారల వెలగేటి కాంతుల శ్రీ లక్ష్మి గిరిశిఖర సంద్రాల పుట్టువుల జగదేక ధాత్రి పరమేష్టి పర్వముల ప్రభవించిన శ్రీమహాలక్ష్మి సిరి వాణి గౌరి రూపుల ధరియించు శ్రీ కనకమహాలక్ష్మి వరములన్నీ తీర్చగ పద్మాసని ప్రభవించే శ్రీ లక్ష్మి కర ముద్రికల అభయహస్తముల దీవించుమహాలక్ష్మి శరణాగతుల కాచేటి సర్వలోకాల సిరి మహాలక్ష్మి చిరునవ్వుల ఇంద్ర కీలాద్రి వెలుగుల శ్రీ కనక దుర్గాలక్ష్మి అరుదెంచి దశ దిశల నవరాత్రి శోభల శ్రీమహాలక్ష్మి సుర అసురుల బ్రోచుటకు అవనిలో ప్రభవించి పరమాత్మ భావముల హృదయ సింహాసిని ఈ శ్రీలక్ష్మీ