రచన: శ్రీమతి కొమాండూరి విజయలక్ష్మి శ్రీనివాసన్ గానం: శ్రీమతి అర్చకం చిత్రలత పచ్చని పసుపు కుంకుమ ప్రాణ ప్రతిష్ఠల శ్రీ శ్రావణ మంగళ గౌరి వెచ్చని ఊర్పుల షోడశ కళల వెలుగొందు శ్రావణ మంగళ గౌరి అరుణోదయ వదన పూర్ణిమవై ఆవిర్భవించిన శ్రీ గౌరి కరుణ గల్గిన కాటుక కన్నుల కరుణించు శుభ కల్ప వల్లి తురీయ ఆనంద సంపదలనిచ్చే సద్గుణ శ్రీ వల్లి పరిక్రమణల యుగ యుగాల వ్రత దీక్షల పాలవెల్లి నిరంతర పతి సేవా భాగ్యముల దీవించు శ్రీ గౌరి పరమేష్ఠి శుభంకర సంతాన సౌభాగ్య పరంజ్యోతి శరణాగత రక్షణ శాశ్వత ఆనంద సుందర వల్లి తరుణి సతులందరు సేవించు శ్రావణ మంగళ గౌరి ధరా తలమున పచ్చని పాడి పంటలనిచ్చు శ్రీ ప్రకృతి నిరామయ విశ్వమున నిండి ఉన్న ధరణీ సతి పరాత్పరి ప్రాణ జ్యోతి పతి వ్రతా తిలక శ్రీ రమణి చరా చర సృష్టి చైతన్య శుభ కర సౌభాగ్య కళ్యాణి.











